Chiyaan Vikram | కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఎస్జే. సూర్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గతేడాది ‘మార్క్ ఆంటోని’, ‘జిగర్తండ డబుల్ ఎక్స్’ లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్న ఈ నటుడు ప్రస్తుతం అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే నాని నటిస్తున్న సరిపోదా శనివారంతో పాటు ధనుష్ మూవీలో నటిస్తున్న ఈ హీరో మరో సినిమాకు సంతకం పెట్టాడు. కోలీవుడ్ హీరో చియన్ విక్రమ్ తన 62వ చిత్రాన్ని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి చిత్తా (తెలుగులో చిన్నా) దర్శకుడు ఎస్.యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో ఎస్జే. సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందించనున్నాడు.
Unexpected #chiyaan62!!!🤯🔥
Welcome on board @iam_SJSuryah
😍♥️#ChiyaanVikram #SJSuriya pic.twitter.com/gTVBvQNfxX— ChiyaanMathanCvf (@mathanotnmcvf) February 9, 2024