శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘అమరన్’ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విషయాన్ని మేకర్స్ బుధవారం ప్రకటించారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్నారు. సాయిపల్లవి కథానాయిక. శివ్ అరూర్, రాహుల్‌సింగ్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్’ అనే పుస్తకంలోని ‘మేజర్ వరదరాజన్’ పాత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కశ్మీర్ నేపథ్యంలో నడిచే ఈ యాక్షన్ డ్రామాలో శివకార్తికేయన్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపిస్తారు. అత్యుత్తమ సాంకేతిక విలువలతో దేశభక్తి ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని మేకర్స్ తెలిపారు