Sivakarthikeyan | శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్గా బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్ నటిస్తున్నట్టు ఆదివారం మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో విద్యుత్ జమ్వాల్ జాయిన్ అయ్యారు.
హై యాక్షన్ ప్యాక్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇదని, శివకార్తికేయన్ కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ మూవీ అని మురుగదాస్ అన్నారు. రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుదీప్ ఎలామన్, సంగీతం: అనిరుథ్, నిర్మాణం: శ్రీలక్ష్మీ మూవీస్.