తెలుగు ఇండస్ట్రీకి మరో తమిళ హీరో.. 20 కోట్ల రెమ్యునరేషన్
దళపతి విజయ్ కూడా తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయబోతున్నాడు. తాజాగా మరో తమిళ హీరో శివ కార్తికేయన్ కూడా తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో తెలుగు హీరోలు తమిళ ఇండస్ట్రీకి.. తమిళ హీరోలు తెలుగు ఇండస్ట్రీకి రావడం కామన్ అయిపోయింది. మొన్నటి వరకు డబ్బింగ్ సినిమాలతో దండయాత్ర చేసిన తమిళ హీరోలు.. ఇప్పుడు వరుసగా తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఊపిరి సినిమాతో కార్తీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ తెలుగు సినిమా చేస్తున్నాడు. లవ్ స్టోరీని నిర్మించిన ఏషియన్ ఫిలింస్ నిర్మాతలే ఈ సినిమాను కూడా నిర్మించబోతున్నారు. డిసెంబర్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు శేఖర్ కమ్ముల. మరోవైపు దళపతి విజయ్ కూడా తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయబోతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా త్వరలోనే మొదలు కానుంది. దీని కోసం ఏకంగా 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో తమిళ హీరో కూడా తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు శివ కార్తికేయన్.
ఇప్పటికే డబ్బింగ్ సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు శివ కార్తికేయన్. అయితే మార్కెట్ మాత్రం సంపాదించుకోలేదు. అలాంటి హీరోతో ఇప్పుడు తెలుగులో ఒక సినిమా నిర్మించడానికి ఒక అగ్ర నిర్మాణ సంస్థ సిద్ధమైంది. జాతి రత్నాలు సినిమాతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు అనుదీప్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. దీనికోసం శివ కార్తికేయన్ ఏకంగా రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తమిళంలో ఈయన సినిమాకు రూ.10 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నాడు. అక్కడ ఈయన మార్కెట్ రూ.40 కోట్లు. ఇప్పుడు తెలుగు, తమిళంలో కలిపి దాదాపు రూ.60 కోట్ల మార్కెట్ ఈజీగా ఉంటుంది అని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. అందుకే రూ.20 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళంలో విడుదల చేయడంతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కులు కూడా అదనం. రెండు భాషల్లోనూ మంచి రేటు వస్తుంది కాబట్టి హీరో అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా శివ కార్తికేయన్ లాంటి మీడియం రేంజ్ హీరోకు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ అంటే చిన్న విషయం కాదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌లో రాశీఖన్నా..?
Bigg boss | బిగ్ బాస్ అప్డేట్.. కంటెస్టెంట్స్ వీళ్ళేనా ?
ఒకే ఒక్కడు రేంజ్లో చరణ్-శంకర్ మూవీ..!
ప్రకాశ్ రాజ్‌కు విజన్ ఉంది,అందుకే సపోర్ట్ చేస్తున్నాను: నాగబాబు
కోట్లు సంపాదించా.. ఇంటి అద్దె కట్టలేనా.. ఎమోషనల్ అయిన ఆర్.నారాయణమూర్తి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

