Jude Anthany Joseph | అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తమిళ నటుడు శివ కార్తికేయన్ మరో క్రేజీ దర్శకుడితో చేతులు కలుపబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఏఆర్ మురుగదాస్‌తో మదరాసి, సుధా కొంగరాతో పరాశక్తి సినిమాలు చేస్తున్న ఈ స్టార్ హీరో తాజాగా మలయాళం దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. 2018 అంటూ వచ్చి హిట్ అందుకున్న మలయాళం దర్శకుడు జూడ్ ఆంటోనీ జోసెఫ్‌తో శివ కార్తికేయన్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘2018’. ఈ సినిమా 2018లో వచ్చిన కేరళ వరదల ఆధారంగా రూపొందిన ఒక సర్వైవల్ డ్రామా. 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే శివ కార్తికేయన్‌తో వస్తున్న ప్రాజెక్ట్‌ను AGS ఎంటర్టైన్మెంట్ నిర్మించబోతుందని సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.