Siva Karthikeyan | తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్, నటి సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ అమరన్. ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ కథ ఆధారంగా.. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఇదే పాత్రలో ఇంటికి వెళ్లి తన భార్యకు సర్ప్రైజ్ను ఇచ్చాడు శివ కార్తికేయన్.
శివ కార్తికేయన్ భార్య ఆర్తి కిచెన్‌లో పని చేసుకుంటుండగా.. అమరన్ మేజర్ ముకుంద్ గెటప్‌లో వెళ్లి సర్ప్రైజ్ను ఇచ్చాడు శివ కార్తికేయన్. ఇక శివను చూసిన ఆర్తి ఒక్కసారిగా షాక్ తింటుంది. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
A touching moment as #Sivakarthikeyan surprises his wife with his #Amaran makeover! Her reaction is pure love, showing the bond they share.pic.twitter.com/SrBOaNQyZt
— Telugu Chitraalu (@TeluguChitraalu) November 13, 2024