కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటించిన ఫన్ ఎంటర్టైనర్ ప్రిన్స్ (Prince). జాతిరత్నాలు ఫేం అనుదీప్ కేవీ (Anudeep KV) డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రంలో ఉక్రెయిన్ భామ మరినా ర్యాబొశప్క హీరోయిన్గా మెరిసింది. తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
ప్రిన్స్ చిత్రాన్ని పాన్ సౌత్ ప్రాజెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేశారు. థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయినా.. మేకర్స్ ధైర్యం చేసి తెలుగు, తమిళంతోపాటు మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసిన ఈ చిత్రం Disney Plus Hotstarలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఓటీటీలో ఎలా ఇంప్రెస్ చేస్తుందనేది చూడాలి.
ఈ చిత్రంలో సత్యరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, సురేశ్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు, సురేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రిన్స్‌కు ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా పాటలకు మంచి స్పందన వచ్చింది.
ప్రిన్స్ ట్రైలర్ పై ఓ లుక్కేయండి మరీ..
Read Also : Vijay Deverakonda | ముంబైలో విజయ్ దేవరకొండ.. కొత్త అప్డేట్ ఏంటో తెలుసా..?
Read Also : Read Also : Yashoda | కోర్టు తీర్పుతో ఆలస్యంగా రానున్న యశోద
Read Also : Mahesh Babu | తండ్రి గురించి మహేశ్‌బాబు ఎమోషనల్ ట్వీట్..
Read Also : Allari Naresh | చివరి 20 నిమిషాల క్లైమాక్స్ సినిమాకే హైలెట్ : అల్లరి నరేశ్
Read Also : Kriti Sanon | స్కూల్‌కు వెళ్లిన మహేశ్ హీరోయిన్ కృతిసనన్ .. స్పెషల్ ఏంటంటే..?