Parasakthi Telugu Teaser | అమరన్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న తమిళ నటుడు శివ కార్తికేయన్ (Sivakarthikeyan) మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆకాశం నీ హద్దురా లాంటి సూపర్ హిట్ అందుకున్న తెలుగు దర్శకురాలు సుధా కొంగర (Sudha Kongara) తన తదుపరి చిత్రం శివ కార్తికేయన్‌తో చేస్తున్న విషయం తెలిసిందే. రెడ్ జెయింట్, డాన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జయం రవి (Ravi Mohan) విలన్‌గా నటిస్తుండగా.. శ్రీలీల, అథర్వ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్‌ను వదిలారు.
ఈ సినిమాకు దివంగత నటుడు శివాజీ గణేషన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం పరాశక్తి అనే టైటిల్‌ను పెట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక టీజర్ చూస్తే.. 1960, 70ల కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. శివకార్తికేయన్ ఇందులో స్టూడెంట్ లీడర్‌గా కనిపించబోతున్నాడు. సైన్యమై కదలిరా.. పెను సైన్యమై కదలిరా అంటూ శివ కార్తికేయన్ టీజర్లో చెప్పిన డైలాగ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు.