Prince Movie | ‘ప్రిన్స్’ సెకండ్ సింగిల్ రిలీజ్.. థమన్ వాయిస్ అదరహో..!
Prince Movie Second Single | కోలీవుడ్ హీరోలు ప్రస్తుతం టాలీవుడ్లో మార్కెట్‌ను పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే నేరుగా తెలుగు దర్శకులతోనే చేతులు కలుపుతున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు టాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలను కోలీవుడ్ హీరోలు ప్రస్తుతం టాలీవుడ్లో మార్కెట్‌ను పెంచుకునే పనిలో ఉన్నారు.
Prince Movie Second Single | కోలీవుడ్ హీరోలు ప్రస్తుతం టాలీవుడ్లో మార్కెట్‌ను పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే నేరుగా తెలుగు దర్శకులతోనే చేతులు కలుపుతున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు టాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలను కోలీవుడ్ హీరోలు ప్రస్తుతం టాలీవుడ్లో మార్కెట్‌ను పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే నేరుగా తెలుగు దర్శకులతోనే చేతులు కలుపుతున్నారు. ఇప్పటికే పలువురు కోలీవుడ్ స్టార్ హీరోలు టాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ తమిళ హీరోల లిస్ట్‌లో శివకార్తికేయన్ ఒకడు.
‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివ కార్తికేయన్ ‘డాక్టర్’, ‘డాన్’ వంటి వరుస హిట్లతో టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో శివ నేరుగా తెలుగులో ‘ప్రిన్స్’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఇక్కడి ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ కేవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమా సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు. ‘జెస్సికా’ అంటూ సాగే పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. తమన్ స్వర పరిచిన ఈ పాటను తనే స్వయంగా ఆలపించాడు. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించాడు. చాలా కాలం తర్వాత తమన్ తన సినిమాలో పాట పాడాడు. ఇప్పటికే విడుదలైన ‘బింబిలికిపిలాపి’ పాటకు శ్రోతల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రంలో శివ కార్తికేయన్‌కు జోడీగా మారియా ర్యాబోషప్క హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మొదట ఈ చిత్రాన్ని ఆగస్టు 31న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను రెండు నెలలు పోస్ట్ పోన్ చేశారు.
Read Also:
SSMB29 Movie | మహేష్-రాజమౌళి సినిమాలో హాలీవుడ్ నటుడు?
Cobra Movie | కోబ్రా మూవీ ఓటీటీ డేట్ కన్ఫార్మ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Vikram Movie | 100ఏళ్ళ కోలీవుడ్ సినీ చరిత్రలో.. ‘విక్రమ్’ మూవీ సంచలన రికార్డు
Ira Khan | ఫిట్నెస్ ట్రైనర్‌తో బాలీవుడ్ స్టార్ హీరో కూతురు ప్రేమాయణం.. వీడియోతో అఫిషియల్ ప్రకటన
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

