బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘౩ ఇడియట్స్’, ‘ధూమ్3’, ‘పీకే’, ‘దంగల్’ వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే ఈయన నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ విడుదలై ఫ్లాప్‌గా మిగిలిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగచైతన్య కీలకపాత్రలో నటించాడు. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అమీర్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా మిగిలింది. ఇదిలా ఉంటే తాజాగా ఈయన కూతురు ఐరా ఖాన్ తను ప్రేమలో ఉన్నట్లు అఫిషియల్‌గా ప్రకటించింది.
ఐరాఖాన్ ఫిట్నెస్ ట్రైనర్ నుపూర్ శిఖారేతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది. గత కొంత కాలంగా బాలీవుడ్లో ప్రేమ పక్షుల్లా విహరిస్తున్న ఈ జంట తాజాగా తమ ప్రేమబంధాన్ని అఫిషియల్‌గా ప్రకటించింది. కాగా తాజాగా ఐరా ఖాన్ ఓ వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో నుపుర్.. ఉంగరం తొడిగి ఐరాకు ప్రపోజ్ చేయగా.. ఐరా ఖాన్ ఓకే చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అమీర్‌ఖాన్, తన మొదటి భార్య రీనాదత్తాకు ఐరా ఖాన్ జన్మించింది. ఇక ఇటీవలే అమీర్ తన రెండో భార్య కిరణ్‌రావుతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
Read Also:
AK61 Movie | 11 ఏళ్ళ తర్వాత నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో అజిత్..!
Krishna Vrinda Vihari Review | కృష్ణ వ్రింద విహారి మూవీ రివ్యూ
Thiru Movie | ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ ‘తిరు’ మూవీ.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?