Siva Karthikeyan | తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మానగరం. ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో లాంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్‌తో కూలీ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా అనంతరం లోకేష్ ఎవరితో సినిమా తీస్తాడు అనేదానిపై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ కూడా ఆసక్తిగా ఎదరుచూస్తుంది. అయితే ఈ క్రమంలోనే లోకేష్ తర్వాతి మూవీ ఒక స్టార్ హీరోతోనని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇంతకి అతనేవరో కాదు. తమిళ నటుడు శివకార్తికేయన్. రెమో, డాక్టర్, మహావీరుడు, రజినీ మురుగన్, పిన్స్ చిత్రాలతో అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అమరన్ అనే సినిమాతో వస్తున్నాడు శివ కార్తికేయన్. ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. అయితే ఈ సినిమా అనంతరం శివకార్తికేయన్ లోకేష్‌తో ఒక మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే శివ కార్తికేయన్ ఫ్యాన్స్‌కు పండగా అని చెప్పుకోవాలి. కాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.