Siva Karthikeyan – Sai Pallavi | కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, నటి సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం అమరన్. ఇండియాస్ మోస్ట్ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ కథ ఆధారంగా ఈ సినిమా రానుండగా.. ఇందులో శివ కార్తికేయన్ ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నాడు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్‌తో కలిసి హీరో కమల్‌హాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ఆడియో వేడుకను శుక్రవారం చెన్నైలో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకలో సాయిపల్లవి తనను అన్న అని పిలిచింది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శివ కార్తికేయన్.
నేను ఓ టీవీ ఛానల్లో పని చేస్తున్నప్పుడు సాయి పల్లవిని తొలి సారి కలిశాను. నేను హోస్ట్‌గా చేసిన ఆ షోకి సాయి పల్లవి వచ్చింది. అప్పటికే ఢీ షో ద్వారా సాయి పల్లవి చాలా ఫేమస్. అయితే తన ప్రేమమ్ సినిమా చూసి షాక్ అయ్యాను. చాలా బాగా నచ్చేసింది ఆ చిత్రం. దీంతో వెంటనే సాయి పల్లవికి కాల్ చేసి ప్రశంసించాను. అయితే సాయి పల్లవి వెంటనే థాంక్యూ అన్న అని పిలిచింది. అయితే అన్నా అని పిలిచినందుకు చాలా బాధపడ్డాను. అయితే ఆ కాల్‌లోనే చాలా సార్లు అన్న అని పిలిచింది. నువ్వు అన్న అని మాత్రం అనకండి అంటూ సాయిపల్లవికి చెప్పాను అంటూ శివ కార్తికేయన్ చెప్పుకోచ్చాడు
SaiPallavi: Thank You Annaaaa
Sivakarthikeyan: Anna nu mattum sollatha😂❤️#Amaran pic.twitter.com/TbpXRuEQ1Z— AmuthaBharathi (@CinemaWithAB) October 19, 2024