Production 36 | కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టితో సితార ఎంటర్టైన్మెంట్స్ ఒక కొత్త చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. చిత్రానికి అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో తెలుపుతూ.. “అన్ని తిరుగుబాటులకు యుద్ధరంగమే ఆధారం కాదు. కొన్ని విధిచేత ఎంపిక చేయబడతాయి, ఇది ఒక తిరుగుబాటుదారుని కథ” అంటూ పోస్ట్ చేసింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా, సాయి సౌజన్య కూడా ఈ నిర్మాణంలో పాలుపంచుకుంటుంది. ఫార్చ్యూన్ 4 సినిమాస్ శ్రీకర స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నాయి.
రిషబ్ శెట్టి చివరిగా ‘కాంతార’ చిత్రంతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి పనిచేయడం, మరియు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించడం ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Not all Rebels are forged in Battle. ⚔️
Some are chosen by Destiny
And this is that story of a Rebel..💥💥Proudly announcing @SitharaEnts Production No.36 with the versatile and dynamic @shetty_rishab garu. 🔥🔥
Directed by @AshwinGangaraju #SaiSoujanya @Fortune4Cinemas… pic.twitter.com/VDX3tjmwaT
— Naga Vamsi (@vamsi84) July 30, 2025