Sithara Entertainments Casting Call | టాలీవుడ్లోని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తమ కొత్త సినిమా కోసం నూతన నటీనటుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రకటించింది. నటనపై ఆసక్తి ఉండి సినిమా రంగంలో అడుగుపెట్టాలనుకునే యువతీయువకులకు ఇది ఒక మంచి అవకాశం అని ప్రకటించిన సితార.. తమ బ్యానర్లో నిర్మించబోతున్న ప్రొడక్షన్ నెం. 37లో నటించేందుకు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతీయువకులతో పాటు 20 నుంచి 50 ఏండ్ల మధ్య ఉన్న వయస్సువారిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఆసక్తి ఉన్నవారు తమ ప్రొఫైల్స్, ఫోటోలు, నటనకు సంబంధించిన వీడియోలను ఈమెయిల్(sitharaentscasting@gmail.com) లేదా వాట్సాప్ నంబర్(8801990954)కు పంపవచ్చని వెల్లడించింది.
Casting Call Alert! 🚨
Here’s Your chance to shine on the big screen with Sithara Entertainments ~ Production No. 37.📩 Share your profiles today at sitharaentscasting@gmail.com
📱 WhatsApp: 8801990954@SitharaEnts pic.twitter.com/u7QonXZ9dI— Sithara Entertainments (@SitharaEnts) September 13, 2025