ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘మ్యాజిక్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. సంగీత నేపథ్య కథాంశమిదని, కాలేజీ ఫెస్టివల్ కోసం సొంతంగా ఒక పాటను కంపోజ్ చేయడానికి నలుగురు యువకులు చేసే ప్రయత్నం చుట్టూ కథ నడుస్తుందని దర్శకుడు తెలిపారు. తమ కల నెరవేర్చుకోవడానికి మిత్రబృందం చేసే అందమైన ప్రయాణం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్నందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.