Sitara | సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆయన ఇప్పుడు రాజమౌళితో భారీ ప్రాజెక్ట్ చేస్తుండగా, ఈ చిత్రంతో మహేష్ క్రేజ్ మరింత పెరగనుంది. అయితే కృష్ణ కొడుకుగా కాకుండా తనకంటూ మహేష్ బాబు ఎలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో ఇప్పుడు సితార కూడా మహేష్ కూతురిగా కాకుండా తనకంటూ సపరేట్ ఇమేజ్ ఏర్పరచుకుంది. సినిమాలలోకి రాకపోయిన సోషల్ మీడియా ద్వారా మంచి ఇమేజ్ అందిపుచ్చుకుంది. చిన్నవయసులోనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాతో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ చిన్నారి భారీగా ఆర్జిస్తున్నారు.
ఇన్స్టాగ్రామ్ లో తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, వ్యక్తిగత విషయాలను పంచుకోవడంద్వారా సితార క్రేజ్ మరింత పెరుగుతూ పోతుంది. పలు సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా సితార ఉంది. రీసెంట్గా తన తండ్రితో కలిసి ఓ యాడ్ చేసింది సీతూ పాప. అయితే సితార లుక్, ఆమె వెతున్న తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తండ్రిని మించిన అందం అంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. డాన్స్ అంటే ఎంతో ఇష్టపడే సితార.. తన తండ్రి సినిమాల్లోని పాటలకు డ్యాన్స్ చేసి మహేష్ అభిమానులను ఖుషీ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సినిమాలలోకి సితార వస్తే మాత్రం ఆమె రేంజ్ మరో లెవల్‌కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.
గతంలో PMJ జ్యువెల్లర్స్ కి బ్రాండ్ అంబాసిడర్‌గా చేసింది సితార. ఇప్పుడు పీఎంజే జ్యువెలర్స్ మరో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయనుంది. వీరికి బ్రాండ్ అంబాసిడర్ గా సితార ఘట్టమనేని ఉండటంతో తనే షాప్ ఓపెనింగ్ కి వస్తుంది మార్చ్ 30 ఆదివారం ఉగాది నాడు ఉదయం పది గంటలకు హైదరాబాద్ పంజాగుట్టలోని కొత్త PMJ జ్యువెల్లర్స్ షోరూంని సితార ప్రారంభించనుంది. ఈ విషయం తెలిసి మహేష్ ఫ్యాన్స్ ఎగిరి గంతులేస్తున్నారు. సితారని చూసేందుకు మహేష్ అభిమానులు భారీ ఎత్తున రానున్నట్టు తెలుస్తుంది..