పోలికల్లోనే కాదు, బుద్ధిలోనూ తండ్రి మహేశ్‌కి జిరాక్స్ సితార. అవకాశం దొరికినప్పుడల్లా తనలోని సేవానిరతిని చాటుతూనే ఉంది. ఆ మధ్య ఓ నగల దుకాణానికి సంబంధించిన యాడ్‌లో నటించి, తద్వారా వచ్చిన మొత్తాన్ని ఛారిటీకి ఇచ్చేసింది. అలాగే.. తన పుట్టిన రోజు సందర్భంగా అనాథ పిల్లలకు సైకిళ్లు పంచింది. ఇలా చిన్నవయసులో మంచి పనులు చేస్తూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నది సితార.
ఇటీవల హైదరాబాద్‌లోని ఓ వ్యాపారసంస్థ, దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువుకు అతిథిగా వెళ్లింది సితార. ఆ కార్యక్రమంలో పేదలకు, వృద్ధులకు బహుమతులు అందజేసింది. ఈ నేపథ్యంలో స్టేజ్‌పైకి రాలేకపోతున్న వృద్ధులను, చేయి పట్టుకొని మరీ తీసుకొచ్చి బహుమతులిప్పించింది.
చిన్న వయసులో ఇంతటి పెద్దమనసు చూసి మురిసిపోయి సితారను ప్రశంసల్లో ముంచెత్తారు. హీరోయిన్గా చేస్తావా? అని అడిగితే ‘నాకు సినిమాలంటే ఇష్టం. నేను నటించేదీ లేనిదీ నాన్న ఇష్టం. ఒకటిమాత్రం నిజం. ఇకపై నా సంపాదనలో ఫిఫ్టీ పర్సంట్ ఛారిటీలకే’ అంటూ బదులిచ్చింది సితార. ఓవైపు తండ్రి మహేశ్ పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తుంటే, మరోవైపు కూతురు సితార పేదలను ఇలా ఆదుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయమే.