స్టార్ హీరోల పిల్లలు ఒక్కొక్కరుగా వెండితెర ఎంట్రీ ఇస్తున్నారు.మొన్నామధ్య బన్నీ కూతురు అర్హ శాకుంతలం చిత్రంలో నటించగా, ఇప్పుడు సితార ఓ స్టార్ హీరో సినిమాతో తెరంగేట్రం చేయనుందని తెలుస్తుంది. మహేష్ -నమ్రతల తనయుడు గౌతమ్ ఇప్పటికే 1 నేనొక్కడినే చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. సితార ఎంట్రీకి సంబంధించి కొన్నాళ్లుగా చర్చలు నడుస్తున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాతో సితార బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఖరారైందని తెలుస్తోంది.
చివరిగా మాస్టర్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన విజయ్ ప్రస్తుతం బీస్ట్ అనే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.దీని తర్వాత టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 66వ సినిమా చేయనున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సితారను సంప్రదించారని తాజా సమాచారం. విజయ్, వంశీ, దిల్ రాజు లకు మహేష్ బాబు సన్నిహితుడు కాబట్టి సితారను ఈ చిత్రంలో నటింపజేసేందుకు మహేష్ ఫ్యామిలీ ఆసక్తిగానే ఉందని తెలుస్తుంది. అతి త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.