రవితేజ కథానాయకుడిగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. బుధవారం ఈ సినిమాలోని తొలి గీతాన్ని విడుదల చేశారు. మిక్కీ జే మేయర్ స్వరపరచిన ఈ పాటను సాహితీ రచించారు.
‘చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మా..బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మ జట్టుకట్టి చుట్టమల్లె చుట్టుకోమ్మా..’ అంటూ చక్కటి భావాలతో ఈ పాట సాగింది. కశ్మీర్ నేపథ్యంలో చిత్రీకరించిన విజువల్స్ ఆకట్టుకున్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తనదైన శైలి వినోదంతో దర్శకుడు హరీష్‌శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని మేకర్స్ తెలిపారు. జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆయనంక బోస్, రచన-దర్శకత్వం: హరీష్ శంకర్.