Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par). ‘సబ్ కా అప్న అప్న నార్మల్’ అనేది ఉపశీర్షిక. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటిస్తున్నారు. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్ మరియు అపర్ణ పురోహిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్ అప్డేట్ను పంచుకుంది. ఈ మూవీ ట్రైలర్‌ను నేడు రాత్రి 7.50 గంటలకి జీ నెట్వర్క్కి చెందిన ఛానల్స్‌లో అలాగే సోషల్ మీడియాలో 8.20కి విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా వీడియోను పంచుకుంది.
ఆమిర్‌ఖాన్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సూపర్ హిట్ చిత్రం ‘తారే జమీన్ పర్’ (2007) సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోందని ఆమిర్‌ఖాన్ ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఈ చిత్రం కామెడీ ఆధారంగా రాబోతుందని సమాచారం. దాదాపు మూడేళ్ల తర్వాత ఆమిర్‌ఖాన్ నుండి వస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్, నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరందరూ ‘సితారే జమీన్ పర్’ సినిమాతోనే వెండితెరకు పరిచయం కావడం విశేషం.
Our Sitaare’s are popping out of excitement as trailer drops tonight! #SitaareZameenPar Trailer Out Tonight on Zee Network Channels at 7:50-8:10pm & Aamir Khan Production’s Social Media Handles at 8:20pm.
Watch #SitaareZameenPar #SabkaApnaApnaNormal, 20th June Only In… pic.twitter.com/Nw19GruR0d
— Aamir Khan Productions (@AKPPL_Official) May 13, 2025