e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News అల్లూవార‌బ్బాయి హెవీ వ‌ర్క‌వుట్ వీడియో వైర‌ల్

అల్లూవార‌బ్బాయి హెవీ వ‌ర్క‌వుట్ వీడియో వైర‌ల్

అల్లూవార‌బ్బాయి హెవీ వ‌ర్క‌వుట్ వీడియో వైర‌ల్

అల్లు అర‌వింద్ త‌న‌యుడు అల్లు శిరీష్ హీరోగా నిల‌దొక్కుకునేందుకు చాలా కృషి చేస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు తాను చేసిన సినిమాల‌లో ఏ సినిమా మంచి విజయం సాధించ‌క‌పోవ‌డంతో తాజా చిత్రంపై బాగా ఫోక‌స్ పెట్టాడు. ఇటీవ‌ల త‌న సిక్స్ బాడీ ఫొటోని షేర్ చేసిన శిరీష్ తాజాగా ట్రైనింగ్ డే పేరుతో ఓ ఫిట్ నెస్ వీడియో అప్‌లోడ్ చేసారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈ వీడియోలో జిమ్‌లో త‌ను ఎంత క‌ష్ట‌ప‌డ్డాడు అనేది క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. ముందుగా వామప్ చేసిన తర్వాత.. ఒక్క చేతితో డంబెల్స్ లిఫ్ట్ చేయడం చూస్తున్నాం.. 30 సెకన్ల వీడియోలో జిమ్‌కు సంబంధించిన ఇంకా చాలా అంశాలు ఇందులో చూపించారు. ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం ఈయన చేసిన ప్రయత్నంలోని ప్రయాణం నెటిజ‌న్స్‌కి న‌చ్చింది. తనకు తాను గోల్స్ సెట్ చేసుకుని ఫిట్‌నెస్ పరంగా వాటిని చేరుకుంటున్నారు శిరీష్. ప్ర‌స్తుతం ప్రేమ కాదంట అనే సినిమా చేస్తున్నారు శిరీష్‌. ఇందులో అను ఇన్నమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి GA2 మూవీస్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అల్లూవార‌బ్బాయి హెవీ వ‌ర్క‌వుట్ వీడియో వైర‌ల్
అల్లూవార‌బ్బాయి హెవీ వ‌ర్క‌వుట్ వీడియో వైర‌ల్
అల్లూవార‌బ్బాయి హెవీ వ‌ర్క‌వుట్ వీడియో వైర‌ల్

ట్రెండింగ్‌

Advertisement