Sirish | నితిన్ హీరోగా తెరకెక్కిన తమ్ముడు చిత్రం జులై 4న విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లో పాల్గొన్న దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్.. రామ్ చరణ్‌ని ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. గేమ్ ఛేంజర్ ఫలితం తర్వాత , రామ్ చరణ్ కనీసం ఫోన్ కూడా చేయలేదని చెప్పేసరికి ఫ్యాన్స్ భగ్గుమన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ను, నిర్మాతలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు మెగా అభిమానులు. తమ హీరో సినిమాకు పూర్తి సహకారం అందించినా, ఈ విధంగా మాట్లాడటం సరికాదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శిరీష్ తగ్గాల్సి వచ్చింది.
నిన్న రాత్రి ఓ బహిరంగ లేఖ విడుదల చేసి అభిమానుల ఆగ్రహావేశాలని చల్లార్చారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని, మెగా అభిమానుల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదంటూ పేర్కొన్నారు. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ తమకు పూర్తి సమయాన్ని కేటాయించి, సంపూర్ణ సహకారం అందించారని కూడా తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తాను ఎప్పటికీ మాట్లాడనని శిరీష్ హామీ ఇచ్చారు. ఒకవేళ తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే, క్షమించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. అయితే లేఖ తర్వాత కూడా ఫ్యాన్స్ ఆగ్రహం చల్లారలేదు. దాంతో కొద్ది సేపటి క్రితం వీడియో విడుదల చేశారు.
మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి, రామ్ చరణ్, అలాగే మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎలా మాట్లాడుతాము . ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే… క్షమించండి.నేను అభిమానించే హీరోలలో రామ్ చరణ్ ఒకరు. నేను ఉద్దేశపూర్వకంగా రామ్ చరణ్‌ని అనలేదు. మా మధ్య ఉన్న స్నేహంతో మాట దొర్లాను. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లతో కూడా సినిమాలు చేశాం. చిరంజీవితో ఎప్పుడు టచ్ లో ఉంటాము. అనుబంధం ఉన్న వారిని అవమానించే మూర్ఖుడిని కాదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాని పొంగల్‌కి విడుదల చేయోద్దు అని చెప్పి ఉంటే చేసే వాళ్లం కాదు. మంచి మనస్సున్న వ్యక్తి కాబట్టి గురించే మా ఆలోచించారు అని శిరీష్ అన్నారు.
Official statement from our Producer Shirish Garu. pic.twitter.com/I4mv9r18w7
— Sri Venkateswara Creations (@SVC_official) July 2, 2025