బిగ్ బాస్ షోలో ప్రస్తుతం టికెట్ టూ ఫినాలే టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్‌లో గెలిచిన వారు డైరెక్ట్‌గా ఫినాలేకి వెళ్లనుండడంతో ఇంటి సభ్యులు గట్టిగా పోరాడుతున్నారు. తొలి మూడు రౌండ్స్‌లో ఓడిన షణ్ముఖ్, కాజల్, ప్రియాంకలు మధ్యలోనే బయటకు వచ్చేశారు. ఇక సిరి,సన్నీ, శ్రీరామ్, మానస్ మధ్య టికెట టూ ఫినాలే గేమ్ ఆసక్తికరంగా నడుస్తుంది. 90వ ఎపిసోడ్ నాలుగో ఛాలెంజ్ ఇచ్చారు. అయితే ఈ టాస్క్ ప్రారంభం కావడానికి ముందే.. సిరిని ఒళ్లో పడుకోబెట్టుకుని మరీ.. టికెట్ టు ఫినాలే నీకే వస్తుందని చెప్పాడు షణ్ముఖ్.
టికెట్ టూ ఫినాలే టాస్క్ మొదలు కాగా, ఇందులో మానస్, సిరి, సన్నీ, శ్రీరామ్ పాల్గొన్నారు. నలుగురికి నాలుగు పలకలు ఇచ్చి.. వివిధ రకాల సౌండ్స్ వినిపించేవారు.. శబ్ధాలని సరిగ్గా గుర్తించి వరుస క్రమంలో రాసినవాళ్లు మొదటి స్థానంలో నిలుస్తారని బిగ్‌బాస్ ప్రకటించాడు. అయిగే గేమ్ ఆడకుండా బయట ఉన్న ప్రియాంక, కాజల్, షణ్ముఖ్ సలహాలు ఇస్తుండడంతో బిగ్ బిస్ హెచ్చరించాడు.
బిగ్ బాస్ హెచ్చరించిన కూడా కాజల్ ఏ మాత్రం తగ్గలేదు. సౌండ్స్ స్టార్ట్ అయిన తరువాత సైగలు చేస్తూ ఉండటంతో సన్నీ కాజల్‌పై సీరియస్ అయ్యాడు. ఇది టికెట్ టు ఫినాలే మాజాక్లు చేయకు.. నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో.. నువ్ చేసేది రాంగ్.. అంటూ బిగ్ బాస్‌కి కంప్లైంట్ చేశాడు. అయితే సిరి.. తొండి గేమ్ ఆడుతూ కనిపించింది.. బిగ్ బాస్ బోర్డ్‌లు చూపించండి అని చెప్పిన తరువాత పక్కవాళ్ల బోర్డ్‌లో చూసి రాసింది. దీంతో బిగ్ బాస్ ఆమెకు జలక్ ఇస్తూ.. చూసిరాసినవి చెరిపేసెయ్ అని హెచ్చరించాడు.