బిగ్ బాస్ హౌజ్‌లో షణ్ముఖ్-సిరిల వ్యవహారం ఎవరికి ఓ పట్టాన అర్ధం కావడం లేదు. ఫ్రెండ్స్ అంటున్నారు కాని వారు చేసే పనులు మాత్రం వేరేలా పోతున్నాయి. తాజా ఎపిసోడ్లో షణ్ముఖ్‌కి దిష్ఠి ఎక్కువ తగిలేస్తుందని, అందుకోసం అతనికి దిష్టి పూసలు రవితో కట్టించింది. అయితే అవి మాములు దిష్టి పూసలు కాదు, రక్తంలో తడిసిన దిష్టి పూసలు. నా బ్లడ్‌ని పూసలకి రాసి బ్యాండ్ చేశా.. దాని వల్ల నీకు దిష్ఠి తాకదు అని చెప్పింది సిరి.
కరెక్ట్‌గా ఎనిమిది పూసలు పెట్టింది.. నేను కాకుండా ఎనిమిది మంది ఉన్నారుగా.. ఆ ఎనిమిది మంది నుంచి దిష్ఠి తగలకుండా ఎనిమిది పూసలు పెట్టింది అని ఎదురుగా ఉన్న సన్నీతో చెప్పి నవ్వుకున్నాడు షణ్ముఖ్. ఇక మంగళవారం ఎపిసోడ్ మొత్తం సిరి, షణ్ముఖ్ మధ్యే నడిచింది. తిట్టుకోవడం అంతలోనే దగ్గరవడం చేశారు.
ఓ సందర్భంలో షణ్ముఖ్., నీ ఫ్రెండ్షిప్, నువ్వు ఏదీ వద్దని అన్నాడు. నాకు నువ్వు అక్కర్లేదు, వెళ్లిపో అనడంతో సిరి ఏడ్చుకుంటూ బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకుని తల గోడకేసి కొట్టుకుంది. దీంతో హడలిపోయిన షణ్ను.. తల బాదుకోకు, డోర్ తీయంటూ వేడుకున్నాడు . రవి డోర్ బాదడంతో ఏడుస్తూనే గడియ తీసింది. వెంటనే షణ్ను ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు.