బిగ్ బాస్ హౌజ్‌లో అభయహస్తం అనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆసక్తికకరంగా సాగుతుంది.ఈ క్రమంలో షణ్ముఖ్‌తో కలిసి మనంద ఇద్దరం ఓ సాంగ్ చేద్దాం అంది సిరి.దీనికి చిరాకు పడ్డ షణ్ను.. హమీదా కూడా ఇంతే.. వర్క్ అనేసరికి నేను గుర్తొస్తాను. బయటకు వెళ్లి వీడియోలు చేద్దాం అనేసరికి నేను గుర్తొస్తాను అని ఫైర్ అయ్యాడు. దీంతో హర్ట్ అయిన సిరి.. సాంగ్ చేయడానికి నేను నీతా ఇలా ఉంటున్నానా అని బుంగమూతి పెట్టుకుంది.
కొద్ది సేపటికి షణ్ముఖ్ వెళ్లి.. సిరికి సారీ చెప్పాడు. ఆమె ‘ఎవడిక్కావాల్రా సారీ, ఇష్టమొచ్చినట్లు మాట్లాడేసి.. నాకు ఒళ్లు మండిపోతుంది’ అని ఫైర్ అయింది. దీంతో హగ్ ఇచ్చి మళ్లీ సారీ చెప్పాడు షణ్ముఖ్. నేను సారీ చెప్పమన్నా.. హగ్ చేసుకోమనలేదు అని సిరి అంటే.. నా సారీ ఇలాగే ఉంటుందని షణ్ముఖ్ అన్నాడు. దీంతో బొక్కలా ఉందంటూ సిరి నోటికి పనిచెప్పింది.
చూస్తుంటే వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహంలా కనిపించడం లేదనే అభిప్రాయాలు అందరిలో కలుగుతున్నాయి. బిగ్‌బాస్ ఇచ్చిన 5వ చాలెంజ్ ‘కారులో హుషారుగా’ టాస్క్‌లో భాగంగా పోటీదారులు బొమ్మ కారును నడిపిస్తూ పూల కుండీలను వారి బాక్స్‌లో పెట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో కాజల్‌పై సన్నీ విజయం సాధించాడు. కాజల్ గేమ్ లైట్ తీసుకుంటుందని రవి అన్నాడు.