Siren Movie | పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, 2 చిత్రాలతో ఇటీవల మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు తమిళ నటుడు జయం రవి (Jayam Ravi). ఇక ఈ విజయాలతో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే తని ఒరువన్ 2, ఇరైవన్ సినిమాలు చేస్తున్న జయం రవి.. తాజాగా మరో సినిమా అనౌన్స్ చేశాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం సైరన్ (Siren). కీర్తి సురేష్ (Keerthy Suresh) కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సైరన్ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో అప్డేట్ను ప్రకటించారు.
జయం రవి బర్త్ డే సందర్భంగా.. సైరన్ ప్రీఫేస్ (Siren Preface) అనే ప్రోమోను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ ప్రోమోలో జయం రవి జైలులో ఖైదీగా (Prisoner) ఉన్నట్లు కనిపిస్తుండగా.. తన ప్రతీకారం తీర్చుకునేందుకు చూస్తున్నట్లుగా ఉంది. ఇక ఈ ప్రోమోలో జయం రవి రగ్గడ్ లుక్లో అలరించాడు. అన్నాత్తే, విశ్వాసం, హీరో సినిమాలకు రచయితగా చేసిన ఆంటోనీ భాగ్యరాజ్(Antony Baghyaraj) ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్గా నటించనుంది.
Grateful for your love and support❤️
Thank you all especially my incredible fans, my family, #Siren team, @antonybhagyaraj , @sujataa_HMM and @theHMMofficial for #SirenPreFace pic.twitter.com/F2yEuCtrE7— Jayam Ravi (@actor_jayamravi) September 9, 2023