Sir Movie | ధనుష్ ‘సార్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..!
Sir Movie First Single | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తెలుగులో మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సార్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.
Sir Movie First Single | ‘తిరు’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన ధనుష్.. ప్రస్తుతం అదే జోష్‌తో ‘సార్’ చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘రంగ్‌దే’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. కాగా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుసగా అప్డేట్లను ఇస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ను ప్రకటించారు.
సర్ మూవీ ఫస్ట్ సింగిల్‌ను నవంబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా వెల్లడించింది. ఈ సాంగ్ తమిళ వెర్షన్‌కు స్వయంగా హీరో ధనుష్ లిరిక్స్ అందించాడు. కాగా చిత్రబృందం ఫస్ట్‌సింగిల్ అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో ధనుష్, సంయుక్తమీనన్ ఒకరినొకరు రొమాంటిక్‌గా చూసుకుంటున్నారు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తుంది. సితార ఎంటర్టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మొదట డిసెంబర్ 2న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కాగా తాజాగా ఈ చిత్రం ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
The first single from #Vaathi #SIRMovie written by our @dhanushkraja (Tamil) & @ramjowrites ( Telugu ) is all set to release on November 10th#VenkyAtluri @iamsamyuktha_ @_ShwetaMohan_ @vamsi84 @adityamusic @dopyuvraj @NavinNooli #SaiSoujanya @Fortune4Cinemas @SitharaEnts pic.twitter.com/5opRKWbKbA
— G.V.Prakash Kumar (@gvprakash) November 6, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

