‘తిరు’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన ధనుష్.. ప్రస్తుతం అదే జోష్‌తో ‘సార్’ చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘రంగ్‌దే’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మహా శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. ఇక ఇప్పటి నుండి చిత్రబృందం వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ మరో అప్డేట్ను ప్రకటించారు.
సర్ మూవీ సెకండ్ సింగిల్‌ను సిద్ధం చేస్తున్నట్లు సంగీత దర్శకుడు జీ.వి ప్రకాష్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. త్వరలోనే సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే రిలీజైన మాస్టారు.. మాస్టారు పాటకు శ్రోతల నుండి విశేష స్పందన వచ్చింది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తుంది. సితార ఎంటర్టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.