‘నేను ఇండస్ట్రీకొచ్చి పదహారేండ్లయింది. ప్రేక్షకులు బోర్ ఫీలవకుండా ప్రతీ కథలో వైవిధ్యాన్ని చూపించే ప్రయత్నం చేశా. భవిష్యత్తు ఫిల్మ్‌మేకింగ్‌లో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి. అందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అన్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన తాజా చిత్రం ‘సింగిల్’ ఈ నెల 9న ప్రేక్షకులకు ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం శ్రీవిష్ణు విలేకరులతో చిత్ర విశేషాలను పంచుకుకున్నారు.
రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని నవ్వించాలనే ఏకైక లక్ష్యంతో తీసిన సినిమా ఇది. కథ, స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకునేలా సన్నివేశాలుంటాయి. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది.
టైటిల్ ‘సింగిల్’ అని ఉన్నా..ముక్కోణపు ప్రేమకథగా నడుస్తుంది. ైక్లెమాక్స్ చాలా కొత్తగా అనిపిస్తుంది. నేను, ఇద్దరు నాయికలు, వెన్నెల కిషోర్..ఈ నాలుగు పాత్రలు ఆద్యంతం నవ్వుల్ని పంచుతాయి. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కథలో చాలా కీలకంగా ఉంటుంది. ఆయన ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయిన తర్వాత సినిమాకు కొత్త జోష్ వచ్చింది.
షూటింగ్ మొత్తం హైదరాబాద్‌లోనే జరిగింది. ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌ను ఇంత కొత్తగా ఎవరూ చూపించలేదనిపించింది. ఇక్కడి పాపులర్ లొకేషన్స్‌ను బాగా కవర్ చేశాం. సిటీలైఫ్లోని బెస్ట్ మూమెంట్స్‌ను క్యాప్చర్చ చేశాం.
సినిమాల్లో నా డైలాగ్ డిక్షన్ని యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లకోసమే సంభాషణల విషయంలో నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నా. వీలైనంత వరకు ప్రేక్షకుల్ని నవ్వించాలన్నదే నా ఉద్దేశ్యం. గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో నేను డిఫరెంట బాడీలాంగ్వేజ్‌తో కనిపిస్తాను.
కథల విషయంలో ప్రయోగం చేసి ఫెయిల్ అయితే బాధపడకుండా దాన్నొక ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకోవాలి. అంతేకాని కొత్త ప్రయత్నాల్ని మాత్రం మానుకోవద్దు. ప్రస్తుతం ‘మృత్యుంజయ’ అనే థ్రిల్లర్ చేస్తున్నా. ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో పాటు ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేస్తున్నా.