బాలీవుడ్ కాప్ యాక్షన్ ‘సింగమ్’ ఫ్రాంఛైజీకి దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సిరీస్ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘సింగమ్ ఎగైన్’. రోహిత్‌శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్, రణ్‌వీర్‌సింగ్, టైగర్‌ష్రాఫ్, దీపికా పడుకోన్, కరీనాకపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
నవంబర్ 1న విడుదలకానుంది. సోమవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. భారీ ఛేజింగ్, యాక్షన్ హంగులతో ట్రైలర్ ఆద్యంతం రోమాంచితంగా సాగింది. ఈ యాక్షన్ ప్యాక్ట్ ఎంటర్టైనర్లో అజయ్‌దేవ్‌గణ్ పోలీసాఫీసర్ బాజీరావ్ సింగమ్‌గా పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. అర్జున్ కపూర్ ప్రతినాయకుడు డేంజర్ లంకగా కనిపించారు.
రామాయణం స్ఫూర్తితో ఈ ఫ్రాంఛైజీలోని రణ్‌వీర్‌సింగ్ , టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్ పాత్రలను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంది. లేడీ సింగమ్ పాత్రలో దీపికా పడుకోన్ కనిపించింది. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.