Singham 3 | బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి (Rohit Shetty) సినిమాల్లో ‘సింగం’(Singham) సిరీస్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అజయ్ దేవ్‌గణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించాయి. అయితే ఈ సినిమాకు తాజాగా సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. సింగం అగైన్ (Singham Agian) అంటూ వస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లు ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా మూవీ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 12 ఏండ్ల కిందట వచ్చిన సింగం సినిమా బాలీవుడ్లో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. నిజానికి ఇది సూర్య నటించిన యముడు సినిమాకు రీమేక్. దీనికి కొనసాగింపుగా మూడేళ్లకు సింగం రిటర్న్స్ తెరకెక్కింది. ఇది తొలిపార్టుకు మించి కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక అప్పటికే గోల్మాల్ సిరీస్‌తో రక్షిత్‌శెట్టి-అజయ్ దేవగణ్‌ల కాంబినేషన్ సూపర్ హిట్టు అనిపించుకోగా.. సింగం సిరీస్‌తో తిరుగులేని కాంబినేషన్లా క్రేజ్ తెచ్చుకుంది.
BIGGG NEWS… ‘SINGHAM AGAIN’ TO ROAR THIS DIWALI… The wait is over… #RohitShetty finalises the release date of the much-awaited #SinghamAgain: #Diwali 2024.
Stars #AjayDevgn as #BajiraoSingham… Also features #AkshayKumar, #RanveerSingh, #KareenaKapoorKhan, #DeepikaPadukone,… pic.twitter.com/Rh5LhSgCEv
— taran adarsh (@taran_adarsh) June 14, 2024