Singer Shreya Ghoshal | ఇండియన్ స్టార్ ప్లే బ్యాక్ సింగర్ శ్రేయా ఘోషల్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా హ్యాక్ అయినట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. నా ప్రియమైనా స్నేహితులకు & అభిమానులకు ఒక విజ్ఞప్తి. నా ట్విట్టర్ / ఎక్స్ ఖాతా ఫిబ్రవరి 13 నుంచి హ్యాక్ అయింది. ఈ విషయంలో ఎక్స్ టీమ్‌ను సంప్రదించేందుకు నా వంతు ప్రయత్నం చేశాను. కానీ కొన్ని కొన్ని ఆటో జనరేటెడ్ స్పందనల తప్ప మరేమీ రాలేదు. ఇప్పటికీ ఖాతా నా ఆధీనంలోకి రాలేదు. దయచేసి నా ఖాతా నుంచి వచ్చే ఏ లింక్‌పై క్లిక్ చేయవద్దు అలాగే ఏ పోస్ట్‌ని నమ్మవద్దు. నా ఖాతా మళ్లీ తిరిగి వస్తే.. నేనే వ్యక్తిగతంగా వీడియో ద్వారా మీకు అప్డేట్ చేస్తానంటూ శ్రేయా ఘోషల్ చెప్పుకోచ్చింది.