Singer | సెలబ్రిటీలు స్క్రీన్‌పైన చాలా సంతోషంగా సరదాగా కనిపిస్తుంటారు. కాని వారి నిజ జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయో చెబితే కాని తెలియదు. లోలోపల ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా బయటకి మాత్రం చాలా సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. తాజాగా సింగర్ సాకేత్ తను పడ్డ బాధలని గురించి వివరిస్తూ అందరికి షాకిచ్చాడు. సాకేత్ సింగర్‌గానే కాకుండా కామెడీతో కూడా మెప్పిస్తాడు. ప్రస్తుతం సినిమా సాంగ్స్, టీవీ షోలు, బయట ఈవెంట్స్ తో బిజీగా ఉన్నాడు. సాకేత్ ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఓ రేంజ్‌లోనే ఉంటుంది. అయితే అందరిని ఫుల్‌గా నవ్వించే సాకేత్‌లో చాలా బాధలు ఉన్నాయట.
తాజాగా తన సమస్యల గురించి మాట్లాడుతూ.. నేను హిమాటోమా అనే సమస్యతో పుట్టాను. ఎడమ భుజం, తల అటాచ్ అయి పుట్టాను. అలాంటి సమస్య ఉన్న వాళ్ళు బాడీ ఒకవైపు పెరిగి ఇంకోవైపు పెరగదు. 30 ఏళ్ళ లోపు చనిపోతారు. ఆపరేషన్ చేసినా 70 శాతం ఛాన్స్ లేదని చెప్పారు. కాని ఈ రోజు నేను ఇలా ఉన్నాను. 7వ తరగతిలో ఉన్నప్పుడు హార్ట్‌లో ఒక చిన్న హోల్ వచ్చింది. అప్పుడు ఆపరేషన్ చేశారు. ఇక 5 ఏళ్ల క్రితం పెద్ద యాక్సిడెంట్ అయి వెన్నముకకి భారీ గాయం అయింది. దానికి సర్జరీ చేశారు. బానే ఖర్చు అయింది అని చెప్పాడు. అయితే ఇప్పుడు తాను ఆరోగ్యంగా, సంతోషంగానే ఉన్నాడు.
సాకేత్ లైఫ్ లో హెల్త్ పరంగా ఎన్ని సమస్యలు చూశాడో, అవన్నీ దాటుకొని ఇప్పుడు తన కెరీర్లో సక్సెస్ ఫుల్‌గా సాగిపోతున్నాడు. సింగర్ సాకేత్ ఎప్పుడూ చాలా చిల్ ఉంటాడు. షో ఏదైనా సరే సాకేత్ ఉంటే కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తాజాగా ఓ షోకి హాజరై హోస్ట్ వేసిన ప్రశ్నలకి ఫన్నీ ఆన్సర్లు ఇచ్చాడు సాకేత్. అయితే నీ లైఫ్‌లో లో టర్నింగ్ పాయింట్ గురించి చెప్పు సాకేత్ అని అడగగా, ఒక ఘటన గురించి చెప్పుకొని సాకేత్ ఎమోషనల్ అయ్యాడు. నేను ఎంతో నమ్మిన వ్యక్తి నా సొంత తమ్ముడిలా చూసుకున్న వ్యక్తి.. ఓవర్‌నైట్ జంప్ అయిపోయాడు.. ఒక్క ముక్కలో చెప్పాలంటే నన్ను వాడుకొని పారిపోయాడు అంటూ సాకేత్ చెప్పాడు.