Sugar Cane Juice | వేసవిలో చెరకు రసం తాగితే డీహైడ్రేషన్, ఎండ దెబ్బ రాకుండా ఆపవచ్చా..?
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ శరీరాన్ని చల్లబరచేందుకు చాలా మంది సహజంగానే చల్లని పానీయాలవైపు మొగ్గు చూపుతారు. నిమ్మరసం (నీంబూ పానీ), చల్లని లస్సీలు వంటి సంప్రదాయ పానీయాలు తక్షణ ఉపశమనం ఇస్తాయని భావిస్తారు. ఈ జాబితాలో చెరకు రసం (షుగర్‌కేన్ జ్యూస్) కూడా ప్రముఖంగా ఉంటుంది.
Sugar Cane Juice | వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ శరీరాన్ని చల్లబరచేందుకు చాలా మంది సహజంగానే చల్లని పానీయాలవైపు మొగ్గు చూపుతారు. నిమ్మరసం (నీంబూ పానీ), చల్లని లస్సీలు వంటి సంప్రదాయ పానీయాలు తక్షణ ఉపశమనం ఇస్తాయని భావిస్తారు. ఈ జాబితాలో చెరకు రసం (షుగర్‌కేన్ జ్యూస్) కూడా ప్రముఖంగా ఉంటుంది. ఇది సహజంగా తీయగా, తాజాగా అనిపించడంతోపాటు శరీరాన్ని చల్లబరుస్తుందని చాలామంది నమ్మకం. అయితే తీవ్రమైన ఎండలో ఇది నిజంగా హీట్ స్ట్రోక్‌ను నివారిస్తుందా? శరీరానికి అవసరమైన హైడ్రేషన్‌ను అందిస్తుందా? అనే విషయాలపై చెరకు రసం గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిని వైద్యులు వివరిస్తున్నారు.
హైడ్రేషన్ జరుగుతుందా..
హీట్ స్ట్రోక్ అనేది శరీరం తన ఉష్ణోగ్రతను నియంత్రించలేని ప్రమాదకర పరిస్థితి. ఇది ముఖ్యంగా డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ లోపం వల్ల వస్తుంది. చెరకు రసం తాగితే చల్లగా అనిపించినా, ఇది హీట్ స్ట్రోక్‌ను నివారించడానికి అవసరమైన ముఖ్య పోషకాలను అందించదు. చెరకు రసం ఎలక్ట్రోలైట్ డ్రింక్‌లా పనిచేస్తుందని ఒక పెద్ద అపోహ ఉంది. వాస్తవానికి చెమట ద్వారా శరీరం ఒక లీటర్‌కు సుమారు 900 మిల్లీగ్రాముల సోడియంను కోల్పోతుంది. కానీ ఒక గ్లాస్ చెరకు రసంలో కేవలం 11-17 మిల్లీగ్రాముల సోడియం మాత్రమే ఉంటుంది. సోడియం శరీరంలో నీటిని నిల్వ ఉంచడంలో కీలకం. ఇది తక్కువగా ఉంటే హైడ్రేషన్ పూర్తిగా జరగదు. అందుకే చెరకు రసం తాగడం అంటే అసలు శరీరాన్ని హైడ్రేట్ చేయడం కాకుండా చక్కెర నీరు తాగినట్లే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనికంటే కొంచెం ఉప్పు కలిపిన నిమ్మరసం తాగడం ఎంతో మేలు చేస్తుంది.
అధికంగా చక్కెర..
ఇంకో ముఖ్య అంశం చక్కెర పరిమాణం. ఒక గ్లాస్ చెరకు రసంలో సుమారు 25 నుంచి 40 గ్రాముల వరకు చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెంచే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తాగితే ఇది మరింత ప్రభావం చూపుతుంది. తాత్కాలికంగా శక్తి ఇచ్చినా, దీర్ఘకాలికంగా హైడ్రేషన్‌కు పెద్దగా సహాయపడదు. హైజీన్ కూడా చెరకు రసం విషయంలో పెద్ద సమస్యగా మారుతుంది. రోడ్డుపై అమ్మే జ్యూస్ స్టాళ్లు ఎక్కువసేపు ఎండలో ఉంటాయి. యంత్రాలు సరిగ్గా శుభ్రం చేస్తారని నమ్మకం ఉండదు. వాడే ఐస్ కూడా శుద్ధి చేసిన నీటితో తయారై ఉండదు. ఈ కారణాల వల్ల ఈ.కోలి, టైఫాయిడ్, జాండిస్ వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఉప్పు, నిమ్మరసం కలిపిన నీళ్లు బెటర్..
అయితే వేసవిలో ఏం తాగాలి? అంటే.. నిపుణుల సూచన ప్రకారం సాదాసీదా నీరు అత్యుత్తమం. దానికి నిమ్మరసం, కొంచెం ఉప్పు కలిపితే శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు అందుతాయి. శరీరంలో నీటిని నిల్వ ఉంచేలా సహాయపడే పానీయాలపై దృష్టి పెట్టడం అవసరం. చెరకు రసం తాగితే తక్షణంగా చల్లగా అనిపించినా, ఇది హీట్ స్ట్రోక్ నివారణకు లేదా సరైన హైడ్రేషన్‌కు విశ్వసనీయ పరిష్కారం కాదు. తక్కువ సోడియం, ఎక్కువ చక్కెర, హైజీన్ సమస్యల కారణంగా దీన్ని అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవడం మంచిది. వేసవిలో సరైన హైడ్రేషన్ కోసం నిమ్మరసం, ఉప్పు కలిపిన నీరు వంటి సులభమైన పానీయాలు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

