Singer revanth | ఇండియన్ ఐడల్-9 విజేత, ప్లే బ్యాక్ సింగర్ రేవంత్ పెళ్ళి వేడుకలు నిన్న గుంటూరులో ఘనంగా జరిగాయి. కరోనా పరిస్థుల దృష్ట్యా కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో రేవంత్ ఓ ఇంటి వాడయ్యాడు. గతనెల డిసెంబర్24న అన్విత అనే అమ్మాయితో రేవంత్ నిశ్చితార్థం జరగగా నిన్న గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా పెళ్ళి వేడుకలు జరిగాయి. పలువురు సినీ గాయనిగాయకులు ఈ పెళ్ళికి హాజరయ్యారు. ఈ వివాహనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.