Singer | మలయాళ సంగీత అభిమానులకి బాగా పరిచయమైన పేరు ఆర్య దయాల్ . స్టేజ్ షోలు, మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శనలతోనే కాకుండా, సొంత స్టైల్లో పాడే పాటలతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ సింగర్ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కారణంతో వార్తల్లోకి ఎక్కింది. ఇటీవలే తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టిన ఆర్య, తన ప్రేమించిన యువకుడు అభిషేక్ ను వివాహం చేసుకున్నట్లు స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సంప్రదాయ హంగులు లేకుండా, సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఆర్య తన భర్తతో కలిసి దిగిన ఫోటోలు, పెళ్లి సర్టిఫికెట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అవి కాస్తా వైరల్‌గా మారాయి.
ఆర్య భర్త అభిషేక్ కూడా సంగీత రంగానికి చెందినవారే కావడంతో, వీరిద్దరూ ఆర్టిస్టిక్ దంపతులుగా పేరొందుతున్నారు. స్టేజ్ లైఫ్‌ను చాలా స్ట్రాంగ్‌గా కొనసాగిస్తున్నప్పటికీ, వ్యక్తిగత జీవితం మాత్రం ఎంతో సాధారణంగా గడుపుతున్న ఆర్య దయాల్ నిర్ణయంపై నెటిజన్ల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్య దయాల్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల నటించిన హిట్ మూవీ ‘బేబీ’ లో ఆమె పాడిన ‘దేవరాజ్ సాంగ్’ యూత్‌లో భారీగా ట్రెండ్ అయింది. క్లాసిక్ టచ్‌తో, పాప్ స్టైల్లో పాడిన ఆ గానం యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించింది.
కేవలం పాపులర్ సాంగ్స్ మాత్రమే కాదు, మెలోడీ ట్రాక్స్లోనూ తన ప్రత్యేక శైలితో ఆకట్టుకునే ఆర్య, ప్రస్తుతం మలయాళ సినిమాలలోనే కాకుండా ఇతర భాషల చిత్రసీమలోనూ అవకాశాలు అందుకుంటోంది. పాటల ఎంపికలో తన స్టైల్‌ను మర్చిపోకుండా, ప్రతి ప్రాజెక్ట్‌లోనూ ఓ ప్రత్యేకతను చూపించేందుకు ప్రయత్నిస్తోంది.ఆర్య పెళ్లి ఫోటోలు బయటకు వచ్చి వైరల్ అయిన వెంటనే, ఫ్యాన్స్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, సింగర్లు ఈ కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.