Singer Mangli | నేను బానే ఉన్న ఆ రూమర్స్ నమ్మొద్దు.. కారు ప్రమాదంపై మంగ్లీ క్లారిటీ
Singer Mangli | ప్రముఖ టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ (playback singer) మంగ్లీ (Mangli) రోడ్డు ప్రమాదానికి గురైయినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ డీసీఎం వ్యాన్ ఢీకొట్టిందని. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది.
Singer Mangli | ప్రముఖ టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ (playback singer) మంగ్లీ (Mangli) రోడ్డు ప్రమాదానికి గురైయినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ డీసీఎం వ్యాన్ ఢీకొట్టిందని. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారి (Hyderabad-Bengaluru Highway)పై తొండుపల్లి వంతెన వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా ఈ వార్తలపై మంగ్లీ స్పందించింది. నేను క్షేమంగా ఉన్నానని మంగ్లీ పేర్కొంది. ఈ ఘటన రెండు రోజుల క్రింద జరిగింది. అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదం. దయచేసి ఈ సంఘటన గురించి వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దు. నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. అంటూ మంగ్లీ తెలిపింది.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో నిర్వహించిన ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు. కార్యక్రమం పూర్తి చేసుకొని అర్ధరాత్రి సమయంలో మేఘ్రాజ్, మనోహర్‌తో కలిసి ఆమె కారులో ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్దకు రాగానే కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం వాహనం వెనుక నుంచి వేగంగా మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యారు. కారు వెనుక భాగం కూడా పూర్తిగా దెబ్బతినింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

