Singer Kalpana| సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకుందని గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని ప్రముఖ సింగర్ కల్పన స్పష్టం చేశారు. నిద్రమాత్రలు అతిగా వాడడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టు పోలీసులకి ఆమె వాంగ్మూలం ఇచ్చారు. తన కుటుంబంలో ఎవరితో తనకి గొడవలు లేవని ఆమె చెప్పారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె నిద్ర కోసం 8 మాత్రలు వేసుకోగా, అయినా నిద్రరాకపోవడంతో మరో 10 మాత్రలు వేసుకున్నారు. రోజూ మోతాదులో నిద్రమాత్రలు వేసుకునే తాను ఆ రోజు ఎక్కువగా వేసుకోవటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిందట.
అయితే తర్వాత ఏమి జరిగిందో తనకు తెలియదని కల్పన తన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. కాగా, కల్పన నటిగా, రచయితగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ప్రేక్షకులని అలరించింది. ఐదేళ్ల వయసులోనే సింగర్ కెరీర్ స్టార్ట్ చేసిన కల్పన… 2013 నాటికి భారతదేశంతో పాటు విదేశాల్లోనూ 1500 పాటలను రికార్డు చేసింది. ఇవే కాక 3000 కాన్సర్ట్ లలో పర్ఫామ్ చేసి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కల్పనా రాఘవేందర్ పాడిన పాటలు అప్పట్లో ప్రేక్షకులను ఒక ఊపు ఊపేశాయి. భక్తి పాటల నుంచి మొదలు పెడితే రొమాంటిక్, ఐటం సాంగ్స్.. ఇలా అన్ని జానర్ల పాటలు పాడి సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కల్పన.
అయితే కల్పన పాడిన పాటలలో బెస్ట్ టాప్ సాంగ్స్ ఏవనేది చూస్తే.. జూలే జూలే – వర్షం సినిమా , యే జిల్లా – శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా , గోంగూర – వెంకీ సినిమా , అధిరే అధిరే – నువ్వోస్తానంటే నేనొద్దంటానా సినిమా, ఏ ఊరే చిన్నదానా – భద్ర , ప్రేమంటే సులువు కాదురా – ఖుషి సినిమా , ముసుగు వెయ్యొద్దు మనసు మీద – ఖడ్గం సినిమా , చెలియా చెలియా సింగారం – కలుసుకోవాలని సినిమా, అబ్బో నీ అమ్మ గొప్పదే – అంజి సినిమా , శ్రీ ఆంజనేయ శ్లోకం – శ్రీ ఆంజనేయం సినిమా చిత్రాలు ఉన్నాయి. ఇక కల్పన పలు అవార్డ్స్ కూడా అందిపుచ్చుకుంది.