Sing Geetham | ఓటీటీలోకి సింగ్ గీతం .. నాలుగు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్!
Sing Geetham | ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 61వ చిత్రం 'సింగ్ గీతం' థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. సంగీతం, ఫాంటసీ, భావోద్వేగాలను వినూత్నంగా మేళవించిన ఈ చిత్రం త్వరలోనే ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ ప్రీమియర్ కానుంది.
Sing Geetham | ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 61వ చిత్రం ‘సింగ్ గీతం’ థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. సంగీతం, ఫాంటసీ, భావోద్వేగాలను వినూత్నంగా మేళవించిన ఈ చిత్రం త్వరలోనే ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ ప్రీమియర్ కానుంది. థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించగా, ఇప్పుడు మరింత విస్తృత ప్రేక్షకులకు చేరుకునేందుకు చిత్రబృందం సన్నాహాలు పూర్తి చేసింది. నిర్మాత నాగ్ అశ్విన్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం, జూలై 9, 2026 నుంచి ‘సింగ్ గీతం’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ఈ చిత్రాన్ని కేవలం తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే విడుదల చేయగా, ఓటీటీ విడుదల సందర్భంగా ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళం భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
దీంతో దక్షిణాది నాలుగు ప్రధాన భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా నిర్మాత నాగ్ అశ్విన్ మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. థియేటర్లలో విడుదలైన వెర్షన్‌తో పోలిస్తే ఓటీటీ వెర్షన్లో కొన్ని సాంకేతిక మెరుగుదల చేసినట్లు తెలిపారు. ఆడియో, విజువల్ ప్రెజెంటేషన్‌తో పాటు కొన్ని సన్నివేశాల్లో కూడా స్వల్ప మార్పులు చేసి, ఇంట్లో కూర్చుని చూసే ప్రేక్షకులకు మరింత మెరుగైన అనుభూతిని అందించేలా సినిమా సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.
‘సింగ్ గీతం’ భారతీయ సినిమాల్లో చాలా అరుదుగా చూసే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఒక చిన్న గ్రామంలో జరిగే ఓ మాయా సంఘటన తర్వాత అక్కడి ప్రజల జీవితాలు పూర్తిగా మారిపోతాయి. వారు మాట్లాడే ప్రతి భావోద్వేగం, ప్రతి స్పందన పాట రూపంలో వ్యక్తమవుతుంది.సంతోషం, బాధ, కోపం, ప్రేమ, ఆశ్చర్యం… ఇలా ప్రతి భావాన్ని సంగీతం ద్వారానే వ్యక్తపరిచే ఆ గ్రామం చుట్టూ కథ సాగుతుంది. ఫాంటసీ, సంగీతం, భావోద్వేగాలను వినూత్నంగా మిళితం చేసిన ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది.య ఈ చిత్రంలో అయాన్, అహిల్యా బమ్రూ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు షాలిని కొండేపూడి, నివేదా పేతురాజ్, శివన్నారాయణ, బెనర్జీ, తులసి శివమణి, అగు స్టాన్లీ చీడోజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.అలాగే టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ప్రత్యేక అతిథి పాత్ర (కామియో)లో కనిపించడం మరో విశేషం. ఆయన పాత్ర సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

