Sing Geetham | ‘సింగ్ గీతం’కు ఫ్యామిలీ ఆఫర్.. తెలంగాణ మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ ధర తగ్గింపు!
Sing Geetham | లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 61వ చిత్రంగా తెరకెక్కిన ‘సింగ్ గీతం’ సినిమా విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
Sing Geetham | లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 61వ చిత్రంగా తెరకెక్కిన ‘సింగ్ గీతం’ సినిమా విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రంలో అయాన్, అహల్య ప్రధాన పాత్రల్లో నటించారు.
అయితే సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ నేపథ్యంలో మేకర్స్ తెలంగాణలోని మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు రూ.200గా ఉన్న టికెట్ ధరను రూ.175కు తగ్గించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు సినిమా మరింత అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకు పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించగా, తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేశారు. ఈ పాజిటివ్ ఎండార్స్మెంట్స్, టికెట్ ధర తగ్గింపు వీక్ డేస్‌లో సినిమా వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. ఈ చిత్రంలో శాలిని కొండెపూడి, నివేదా పేతురాజ్, శివన్నారాయణ, బెనర్జీ, తులసి శివమణి, అగు స్టాన్లీ చియెడోజీ కీలక పాత్రల్లో కనిపించారు. విజయ్ దేవరకొండ స్పెషల్ క్యామియోలో మెరిశారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

