Simran | STOP.. ఇది చాలా శక్తివంతమైన పదం.. ఇకనైనా ఆపండి.. అంటూ ఘాటుగా స్పందించారు సీనియర్ నటి సిమ్రాన్. సోషల్మీడియాలో తనపై వస్తున్న వార్తలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇన్నాళ్లుగా నన్ను ఎవరోఒకరితో ముడిపెడుతూ సోషల్మీడియాలో వార్తలు రాస్తూనే ఉన్నారు. అవేమీ పట్టించుకోకుండా నిశ్శబ్దంగా నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను.
కానీ నా నిశ్శబ్దాన్ని చేతకాని తనం అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు అన్నింటికీ స్పష్టత ఇస్తున్నా. ఏ పెద్ద హీరోతో పనిచేయాలన్న కోరిక నాకు లేదు. ఇప్పటికే వారితో చాలా సినిమాలు చేశా. ఇప్పుడు నా లక్ష్యాలు వేరు. ఎవరూ హద్దులు దాటొద్దు. నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే క్షమించను. నాపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవాళ్లు వెంటనే నాకు క్షమాపణలు చెప్పాలి. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.’ అంటూ హెచ్చరించారు సిమ్రాన్.