Simbu | మంచు మనోజ్ కొద్ది రోజుల క్రితం వాళ్లింట్లో జరిగిన పలు ఇష్యూస్‌తో హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఇప్పుడు మే 30న రాబోతున్న భైరవం సినిమా ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. గత రాత్రి భైరవం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, ఈ కార్యక్రమంలో శింబు ఫోన్ నెంబర్ లీక్ చేశాడు మనోజ్. ముందుగా మనోజ్ లైవ్ లోనే తమిళ స్టార్ హీరో శింబుకి కాల్ చేశాడు. మనోజ్ ఫోన్లో వాయిస్ సరిగ్గా వినిపించకపోవడంతో.. పక్కనే ఉన్న హీరోయిన్ అదితి శంకర్ ఫోన్ తీసుకుని కాల్ చేశాడు. ఇక అప్పుడు ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. కమల్ హాసన్ సార్ తో నటించావు.. నిన్ను చూస్తే జలసీగా ఉంది.. థగ్ లైఫ్ కు ఆల్ ది బెస్ట్ మచ్చా.. అని మనోజ్ అనడంతో అందుకు శింబు థ్యాంక్స్ అని చెప్పారు.
ఇక చివరలో మనోజ్ గురించి ఒక విషయం చెప్పాలి. మనోజ్ చిన్నపిల్లాడి లాంటివాడు. మనం ప్రేమిస్తే తిరిగి అంతకుమించిన ప్రేమను చూపిస్తాడు. అదే ద్వేషిస్తే అతనితో మనకే రిస్క్ అని అన్నాడు. అందుకే మనోజ్‌ను ఎక్కువగా ప్రేమించాలి.. మనోజ్ లాంటి ఫ్రెండ్‌ను నాకు దొరకడం నా అదృష్టం అంటూ శింబు అన్నాడు. అయితే మనోజ్.. శింబుతో కాల్ మాట్లాడే సమయంలో శింబు నంబర్ బయటకు కనిపించేలా ఫోన్ పట్టుకున్నాడు. అలా ఫోన్ నంబర్ లీక్ అయిన విషయాన్ని మనోజ్ గుర్తించి.. మచ్చా.. ఫోన్ నంబర్ లీక్ అయినట్టుగా ఉంది.. నీకు ఓ కొత్త సిమ్ కార్డ్ పంపిస్తాను అని అనడంతో శింబు.. అయ్యో అని షాక్ అయ్యాడు. మొత్తానికి వీరిద్దరి మధ్య సంభాషణ హైలైట్ కాగా, ఆయన ఫోన్ నెంబర్ లీక్ కావడం మరో హైలైట్.
ఇక ఈ ఈవెంట్లో మంచు మనోజ్ మాట్లాడుతూ.. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత తాను నటిస్తున్న సినిమా ఇదని మనోజ్ గుర్తుచేశారు. జీవితంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్న తాను ఈ స్థాయిలో ఉండటానికి తన బృందమే కారణమని, తన సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్లు, ఇంట్లో పనిచేసే వారు అందరు తనకు అండగా నిలిచారని వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు మనోజ్. ఈ సినిమా ఒక్కరి వల్ల సాధ్యం కాదని, ఎంతోమంది కష్టం ఇందులో ఉందని, ఈ చిత్రాన్ని ఆశీర్వదించాలని కోరారు. నారా రోహిత్, సాయి శ్రీనివాస్‌తో తన అనుబంధం ఈ సినిమాతో మరింత పెరిగిందని మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత రాధామోహన్ తమ ముగ్గురిని నమ్మి ఈ సినిమా నిర్మించినందుకు ఆయనని కొనియాడారు మనోజ్. ఇక భైరవం బాయ్‌కాట్‌పై కూడా మనోజ్ స్పందించారు. దయచేసి ప్రతి ఒక్కరు ఈ మూవీని సపోర్ట్ చేయాలని కోరారు.