SIMBA is Coming – PVCU2 |టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడా అని అటు నందమూరి ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకత్వం వహించేది హన్మాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ అని ఇప్పటికే ప్రకటించారు. ఇక ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రాబోతుండగా.. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సాలిడ్ అప్డేట్ను పంచుకున్నాడు ప్రశాంత్ వర్మ.
సింబా వచ్చేస్తున్నాడు.. శుక్రవారం ఉదయం 10.36 గంటలకు సింబా ఫస్ట్ లుక్ అంటూ ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. అయితే సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ బర్త్‌డే. ఈ సందర్భంగానే మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తోందట. ఇక ఈ సినిమాను బాలయ్య సొంతంగా ప్రొడ్యూస్ చేయబోతున్నాడని.. ఆయన చిన్న కూతురు తేజస్విని ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించబోతోందని ఇండస్ట్రీ జనాల టాక్. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
The moment has arrived to take the LEGACY forward!#SIMBAisComing 🦁#PVCU2 Announcement Tomorrow at 10:36 AM ❤️🔥@ThePVCU pic.twitter.com/NPGI9mLegF
— Prasanth Varma (@PrasanthVarma) September 5, 2024