వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతీ గోస్వామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సిల్క్ శారీ’. టి.నాగేందర్ దర్శకుడు. కమలేష్ కుమార్, రాహుల్ అగర్వాల్ హరీష్ చండక్ నిర్మాతలు. శుక్రవారం ఈ సినిమాలోని ‘చేతులోని స్కాచ్ గ్లాస్’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను దర్శకుడు సాయిరాజేష్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది.
యథార్థ సంఘటనల ఆధారంగా వినూత్నమైన కథతో తెరకెక్కించాం. టైటిల్ బాగుందని ప్రశంసలొస్తున్నాయి. తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది’ అన్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ప్రేమకథా చిత్రమిదని హీరో వాసుదేవ్ రావు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సనక రాజశేఖర్, సంగీతం: వరికుప్పల యాదగిరి, దర్శకత్వం: టి.నాగేందర్.