SIIMA 2025 | దుబాయ్‌లో ఘనంగా జరిగిన సైమా అవార్డ్స్… ఉత్తమ చిత్రాలుగా ‘అమరన్’, ‘మంజుమ్మల్ బాయ్స్’
SIIMA 2025 | దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా నిలిచిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA 2025) వేడుక ఈ ఏడాది దుబాయ్ వేదికగా అత్యంత అట్టహాసంగా జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో తమిళం, మలయాళం చిత్ర పరిశ్రమలకు సంబంధించిన నటీనటులకి పురస్కారాలు అందించారు.
SIIMA 2025 | దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా నిలిచిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA 2025) వేడుక ఈ ఏడాది దుబాయ్ వేదికగా అత్యంత అట్టహాసంగా జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో తమిళం, మలయాళం చిత్ర పరిశ్రమలకు సంబంధించిన నటీనటులకి పురస్కారాలు అందించారు. దక్షిణాది సినీ పరిశ్రమల ప్రముఖులు, దర్శకులు, నటీనటులు పెద్ద ఎత్తున హాజరై వేడుకను మరింత రక్తికట్టించారు. కోలీవుడ్ (తమిళం) విభాగంలో ఉత్తమ చిత్రంగా అమరన్ ఎంపికైంది. ఇదే చిత్రానికి గాను సాయి పల్లవికి ఉత్తమ నటి అవార్డ్ దక్కింది. మాలీవుడ్ (మలయాళం) విభాగంలో ఉత్తమ చిత్రంగా మంజుమ్మల్ బాయ్స్ (Manjummel Boys) ఎంపికైంది.
ఇక ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ (‘The Goat Life’ సినిమాకుగానూ) అవార్డ్ అందుకున్నారు. ఇక సినీ రంగానికి దశాబ్దాల పాటు సేవలు అందించిన నటుడు శివకుమార్‌కి ప్రత్యేక అవార్డ్ అందించారు. అలానే పలు భాషల్లో మెరిసిన ప్రముఖ నటి త్రిషకు ప్రత్యేక గౌరవ పురస్కారాలు అందించారు. ఈ అవార్డ్స్ వేడుకలో రెడ్ కార్పెట్‌పై విభిన్నమైన డిజైనర్ ఔట్‌ఫిట్స్‌తో మెరిసిన నటి నటులు, ప్రదర్శించిన లైవ్ పెర్ఫార్మెన్స్లు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. SIIMA 2025 మొదటి రోజు కార్యక్రమం తెలుగు, కన్నడ పరిశ్రమలకి సంబంధించిన ప్రముఖుల మధ్య జరిగింది. ఆ తర్వాతి రోజు తమిళం, మలయాళం విభాగాలకు సంబంధించిన అవార్డులు ప్రకటించారు.
‘సైమా 2025’ విజేతల జాబితా (మలయాళం)
బెస్ట్ డైరెక్టర్: బ్లెస్సీ (ది గోట్ లైఫ్)
బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్ (ఫిమేల్):ఊర్వశి (ఉళ్లోళుక్కు)
బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ కామెడీ రోల్: శ్యామ్మోహన్ (ప్రేమలు)
బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ నెగెటివ్ రోల్: జగదీష్ (మార్కో)
బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్ (మేల్) – క్రిటిక్స్ ఛాయిస్: ఉన్ని ముకుందన్ (మార్కో)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: జోజూ జార్జ్ (పని)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: దిబు నినన్ థామస్ (ఏఆర్ఎం)
సైమా 2025′ విజేతల జాబితా (తమిళం)
బెస్ట్ డైరెక్టర్: రాజ్‌కుమార్ పెరియసామి (అమరన్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: జీవీ ప్రకాశ్‌కుమార్ (అమరన్)
బెస్ట్ యాక్టర్ ఇన్ నెగెటివ్ రోల్: అనురాగ్ కశ్యప్ (మహారాజ్)
బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ కామెడీ రోల్: బాల శరవణన్ (లబ్బర్ పందు)
బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్ – క్రిటిక్స్ ఛాయిస్: కార్తి (మెయ్యజగన్)
బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్ (ఫిమేల్) – క్రిటిక్స్ ఛాయిస్: దుషారా విజయన్ (రాయన్)
బెస్ట్ డైరెక్టర్ – క్రిటిక్స్ ఛాయిస్: నిథిలన్ సామినాథన్ (మహారాజ్)
స్పెషల్ రైజింగ్ స్టార్: హరీశ్ కల్యాణ్(లబ్బర్ పందు)
స్పెషల్ అవార్డ్ – ఫ్రెష్ ఫేస్: సంజనా కృష్ణమూర్తి(లబ్బర్ పందు)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: తమిళరాసన్(లబ్బర్ పందు)
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

