‘ఇద్దరమ్మాయిలతో’ ‘సరైనోడు’ ‘బింబిసార’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది కథానాయిక కేథరిన్ ట్రెసా. ప్రస్తుతం ఈ భామ సందీప్‌కిషన్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘సిగ్మా’లో ప్రత్యేక గీతంలో నర్తించనుంది. జాసన్ సంజయ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఇందులో సందీప్‌కిషన్‌తో కలిసి కేథరిన్ ఓ ప్రత్యేక గీతంలో స్టెప్పులేయబోతున్నది. ఇందుకోసం సంగీత దర్శకుడు తమన్ హుషారైన బీట్తో ఓ ట్రాక్‌ను కంపోజ్ చేశారని, కలర్‌ఫుల్ సెట్లో తెరకెక్కించనున్న ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో హీరో సందీప్‌కిషన్ పాత్ర సూపర్‌హీరోను తలపించేలా ఉంటుందని, పోరాట ఘట్టాలు థ్రిల్‌ని పంచుతాయని మేకర్స్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.