నరసింహనంది దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై రూపొందిస్తున్న ‘సిగ్గు’ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి జేడీ లక్ష్మీనారాయణ క్లాప్‌నివ్వగా, కె.విజయేంద్రప్రసాద్ కెమెరా స్విఛాన్ చేశారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు నరసింహనంది చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘చలంగారి సుశీల నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం.
ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్నది. పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తాం’ అన్నారు. సామాజిక స్పృహను రేకెత్తించే సినిమా ఇదని నిర్మాత రామసత్యనారాయణ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అబ్బూరి ఉష, సంగీతం: సుక్కు, రచన-దర్శకత్వం: నరసింహనంది.