బిగ్‌బాస్ విజేత సిద్ధార్థ్ శుక్లా మరణానికి కారణం అదేనా.. డాక్టర్లు హెచ్చరించినా వినలేదా..?

ప్రముఖ బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా మరణం అభిమానులను కలచివేస్తోంది. బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈయన.. కేవలం 40 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందడం జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. బాలికా వధు వంటి సీరియల్స్‌తో పాటు.. పలు బాలీవుడ్ సినిమాలు.. ముఖ్యంగా బిగ్ బాస్ షోతో ఈయన ఇమేజ్ చాలా పెరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆయనకు 3.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎంతో ఫిట్‌గా ఉండే సిద్ధార్థ్ గుండెపోటుతో మరణించడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ క్రమంలో ఆయన మరణంపై ఆసక్తికర విషయం ఇప్పుడు ఒకటి వైరల్ అవుతుంది.
ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ తీసుకొని ప్రతి రోజు క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేసే సిద్ధార్థకు గుండెపోటు రావడం ఏంటి అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ అనుమానాలతోనే ఆయన చనిపోయిన తర్వాత పోస్టుమార్టం కూడా చేశారు. ఈ నివేదికలో కూడా గుండెపోటుతో ఆయన మరణించినట్లు తేలింది. సిద్ధార్థ శుక్లాకు ఇంత చిన్న వయసులో హార్ట్ ఎటాక్ రావడానికి కారణం ఏంటి అంటూ చాలా మంది ఆరా తీస్తున్నారు. ఇందులో కొన్ని విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. చనిపోయే ముందు రోజు రాత్రి కూడా సిద్ధార్థ 3 గంటల వర్కౌట్స్ చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు ఛాతీలో నొప్పి వస్తుంది అంటూ తన తల్లిని నిద్ర లేపితే.. ఆమె ఒక టాబ్లెట్ ఇచ్చి పడుకోబెట్టిందని తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ ఆయన మేలుకొనలేదని వైద్యులు తెలిపారు.
సెప్టెంబర్ 2 ఉదయం 10: 30 నిమిషాలకు గుండెపోటుతో ఆయన మరణించారు. అయితే ఆయన మరణానికి కారణం అధికంగా వర్కవుట్ చేయడమే అని తెలుస్తోంది. రోజుకు 3-4 గంటలు సిద్దార్థ్ ఫిజికల్ వర్కవుట్స్ చేసేవాడు. జిమ్‌లో అంత సేపు కష్టపడటం కూడా ఒంటికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయంలో సిద్ధార్థ్ శుక్లాను ఇప్పటికే ఒకసారి డాక్టర్ హెచ్చరించారని.. వర్కౌట్స్ సమయాన్ని కాస్త తగ్గించుకోవాలని ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. అయినా కూడా సిద్ధార్థ్ వినిపించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగింది అంటున్నారు వైద్యులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
MAA | ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న జీవిత, హేమ.. కారణమిదే
Tollywood Drugs Case| రకుల్ ప్రీత్ సింగ్‌పై ఈడీ ప్రశ్నల వర్షం.. 6 గంటల పాటు విచారణ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

