బాలీవుడ్ సెలబ్రిటీలు సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వాని (Sidharth-Kiara wedding) పెళ్లివేడుకకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజస్థాన్‌లోని జైసల్మీర్ సూర్యగఢ్ ప్యాలెస్ (Suryagarh Palace hotel)లో ఈ ప్రేమ జంట వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ తో కోట పరిసర ప్రాంతాలు కలర్ఫుల్గా మారాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఇప్పటికే రోకా, చూడా సెర్మనీ పూర్తయ్యాయి.
సిద్దార్థ్ మల్హోత్రా-కియారా కుటుంబాలు రోకా సెర్మనీలో పాల్గొన్నారు. చూడా సెర్మనీ కోసం కియారా అద్వాని రెడ్ కాస్ట్యూమ్‌లో మెరిసింది. ఫిబ్రవరి 6న ఈ రెండు కార్యక్రమాలు నిర్వహించారు. చూడా, రోకా సెర్మనీకి సంబంధించి నూతన వధూవరుల స్టిల్స్ … మరోవైపు వెడ్డింగ్ కోసం బ్యాండ్ బాజా టీం కూడా రెడీ అవుతున్న విజువల్స్ ఇపుడు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.
లోకల్ బ్యాండ్ టీం అతిథులకు ఆహ్వానం పలుకుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వెడ్డింగ్ ఈవెంట్‌కు క్లోజ్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, షాహిద్ కపూర్, మీరా కపూర్, కరణ్ జోహార్ తోపాటు ఆర్సీ 15 చిత్రయూనిట్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
Official : #KiaraAdvani Wedding Video.. Stunning Bride 🥰#SidharthMalhotra #SidharthKiaraWedding #KiaraSidharthwedding pic.twitter.com/xIxi8LCtjB
— Vishwajit Patil (@_VishwajitPatil) February 7, 2023