బ్లాక్ బస్టర్ ‘టిల్లు స్కేర్’ తర్వాత సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తెలుసుకదా’. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. ప్రముఖ ైస్టెలిస్ట్ నీరజ కోన డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మంగళవారం మొదలైంది.
30 రోజుల పాటు జరిగే ఈ భారీ షెడ్యూల్లో టాకీ సీన్స్‌తో పాటు రెండు పాటల్ని కూడా తెరకెక్కించనున్నారు. తొలి రోజు సిద్ధూతో పాటు రాశీఖన్నా షూటింగ్లో పాల్గొన్నది. వైవా హర్ష ముఖ్య భూమిక పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: తమన్, ఎడిటింగ్: నవీన్ నూలి, నిర్మాణం: పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ.